నటుడు హృతిక్ రోషన్ ముంబైలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంటులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక అపార్ట్మెంట్ లో డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ తో కలిపి మూడు ఫ్లోర్లలో స్థలాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ వారం ప్రారంభంలో ఈ ఒప్పందం ముగిసినట్లు సమాచారం, దీని విలువ అటు ఇటుగా వందకోట్ల రూపాయలని టాక్. ఈ అపార్టుమెంట్లు జుహు-వెర్సోవా లింక్ రోడ్లోని భవనం యొక్క 14, 15 మరియు 16 అంతస్తులలో ఉన్నాయట.
ఈ అపార్ట్మెంట్ పై నుంచి చూస్తే అరేబియా సముద్రం చాలా అద్భుతంగా కనిపిస్తుందట. ఒక 27534 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ కోసం హృతిక్ రూ .67.5 కోట్లు చరిల్లించాడట. ఇక మరో 11165 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 వ అంతస్తు అపార్ట్మెంట్ కోసం రూ .30 కోట్లు చెల్లించారని సమాచారం. ఇక గత కొంతకాలంగా రోషన్ ఒక అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న విషయం తెలిసిందే. నెలకు దానికి రూ .8.25 లక్షలు చెల్లిస్తున్నారని టాక్.