మంచు విష్ణు సినిమా చూసినట్లుంది

బాలీవుడ్ లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. అన్ని జానర్స్ లో చిత్రాలు చేస్తున్న అక్షయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, హౌజ్ ఫుల్ 4. గతంలో వచ్చిన హౌజ్ ఫుల్ 1, 2, 3 సినిమాలకి ఇది సీక్వెల్ గా రాబోతోంది. పేరుకి సీక్వెల్స్ అయినా ప్రతి సినిమాకి కొత్త కథ ఉంటుంది, ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు. ఇప్పుడు వస్తున్న హౌస్ ఫుల్ 4లో కూడా అంతే, 600 ఏళ్ల క్రితం పుట్టి రాజ వంశులకి ఈ జనరేషన్ ని కలుపుతూ సినిమాని తెరకెక్కించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ చూస్తుంన్నంత సేపు మంచు విష్ణు, రాజ్ తరుణ్ చేసిన ఆడో రకం, ఈడో రకం సినిమా గుర్తొస్తుంది. కాకపోతే తెలుగు సినిమాలో ఇద్దరే హీరోలు, హౌస్ ఫుల్ లో మాత్రం ముగ్గురు హీరోలు. ఈ ముగ్గురికి ముగ్గురు హీరోయిన్స్, వీళ్లు ఎవరిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ల గత జన్మలో జరిగిన కథ ఏంటి? ఈ జన్మలో జరుగుతున్న కథ ఏంటి? అనే విశేషాలని చాలా ఫన్నీగా చూపించారు. ట్రైలర్ లో ప్రతి సీన్ నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తన ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు. ముగ్గురు హీరోయిన్స్ తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. హౌస్ ఫుల్ ట్రైలర్ లో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దగ్గుబాటి రానా. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా కనిపించి, ఎద్దుతో ఫైట్ చేసే సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. హౌస్ ఫుల్ 4లో బాహుబలి సీన్ కి రెప్లికా కూడా ఉంది. మరి ట్రైలర్ తో మెప్పించిన చిత్ర యూనిట్, థియేటర్స్ లో ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.