యూత్ ఈ పాటకి ఫిదా

ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అయినా రామ్ పోతినేని అభిమానులు ఆ ఫీవర్ నుంచి ఇంకా బయటకి రాలేదు. ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ ని మరింత పెంచుతూ 60 రోజుల తర్వాత వీడియో సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇప్పటికే దిమాక్ ఖరాబ్, టైటిల్ సాంగ్స్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఉండిపో వీడియో సాంగ్ బయటకి వచ్చింది. నిధి అగర్వాల్ గ్లామర్, సీ షోర్ లొకేషన్స్, రామ్ స్టైలిష్ యాటిట్యూడ్ ఉండిపో సాంగ్ ని చాలా స్పెషల్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా ఈ సాంగ్ లో నిధి తన గ్లామర్ తో బీ సీ సెంటర్స్ లో ఫిదా చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించిన నిధి అగర్వాల్, తన అందం మొత్తం ఈ సాంగ్ లోనే చూపించింది. పూరి మార్క్ బీచ్ సాంగ్స్ లో ఉండిపో ఎప్పటికీ అతని గుర్తు ‘ఉండిపో’తుంది.