టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన నమిత.. తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. తమిళనాడులో ఈ ముద్దుగుమ్మకు ఏకంగా అభిమానులు గుడి కట్టేశారు. దీనిని బట్టి చూస్తే కోలీవుడ్‌లో నమితకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో బాలయ్య, ప్రభాస్ సరసన నటించినా.. గ్లామర్ రోల్స్‌కు మాత్రమే ఈ అమ్మడు పరిమితమైంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో తాను లావు కావడానికి కారణం ఏంటనే విషయాన్ని నమిత వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ వేదిక నమిత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం తాను బొద్దుగా ఉండేదానిని అని, అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదని, ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారిందంది. అందుకే తన బరువు 97 కిలోలకు చేరిందని , కానీ కొంతమంది మద్యం తాగడం వల్లే బరువు పెరిగానని అనుకున్నారంది. థైరాయిడ్, పీసీఓడీ సమస్యల వల్లే తాను లావుగా మారానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనను మరెంతో బాధించాయని నమిత తెలిపింది.