గ్యాంగ్ స్టర్ కామెడీ డ్రామాతో రాబోతున్న సుమంత్

sumanth

హీరో సుమంత్ ఈ మధ్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు ఈయన. ఇప్పుడు ఈయన నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 2018లో కేరళలో విడుదలై మంచి విజయం సాధించిన పాదయోట్టం సినిమా ఆధారంగా సుమంత్ కొత్త సినిమా తెరకెక్కుతుంది. గ్యాంగ్ స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ చిత్ర తెలుగు వర్షన్‌కు విను యజ్ఞ దర్శకుడు. ఐమా అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాతో పరిచయం అవుతుంది. డిసెంబర్ 15, 2019 నుంచి పాదయోట్టం తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈస్ట్ ఇ:డియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.