World cancer day: నేడు వరల్డ్ క్యాన్సర్ డే.. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని మెడికొవర్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో సుమంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి దశలో క్యాన్సర్‌తో పోరాడటం చాలా బాధ కలిగించిదన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తన సినిమాల్లో కూడా పొగ తాగడం వంటి సీన్లను తగ్గించేశానని చెప్పాడు.
ఎవరైనా సిగరెట్ తాగే సీన్ చెప్పగానే అవసరమా అని వారిస్తున్నానని పేర్కొన్నాడు. కానీ కొన్నిసార్లు పాత్ర డిమాండ్ చేస్తే గనుక అలాంటి సీన్లలో నటించక తప్పదని అన్నాడు సుమంత్. అలాగే తన కుటుంబంలో క్యాన్సర్ వల్ల చాలా మంది చనిపోయారని, మరికొంత మంది క్యాన్సర్‌ను జయించారని చెప్పుకొచ్చాడు. World cancer day అయితే క్యాన్సర్ మొదటి దశను గుర్తించగలిగితే దాన్నుంచే బయట పడేఅవకాశం ఉందన్నాడు. ఇక ప్రస్తుతం సుమంత్ కపటధారి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రదీప్ దర్శకత్వంలో.. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా. జీ ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు.