న్యూడ్ ఫొటో అడిగిన నెటిజన్‌కి చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన పూజాహెగ్డే

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజాహెగ్దే. స్టార్ హీరోల అందరి సరసన అవకాశాలు కొట్టేస్తోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో పూజాహెగ్దే నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే పూజాహెగ్దే.. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

puja hegde naked legs

ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఒక నెటిజన్ న్యూడ్ ఫొటో పంపాలని పూజాహెగ్దేను కోరాడు. దీంతో ఆ నెటిజన్‌కి పూజాహెగ్దే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తన రెండు పాదాలను పూజాహెగ్దే ఫొటో తీసి పోస్ట్ చేసింది. అంటే కాళ్లను చూపిస్తూ తన్నుతా అని అర్థం వచ్చేలా ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఆ నెటిజన్‌కు పూజాహెగ్దే చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు.