తమిళ బ్యానర్, తరుణ్ భాస్కర్ డైలాగ్స్, అక్కినేని అమలా రిఎంట్రీ… శర్వానంద్ ప్లాన్ అదిరింది

కంటెంట్ ఉన్న సినిమాలని చేసే యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం మూవీ చేస్తున్నాడు. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్ సిద్దార్థ్ నెగటివ్ లీడ్ ప్లే చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఒక బైలింగ్వల్ సినిమాతో ఆడియన్స్ పలకరించడానికి సిద్దమయ్యాడు.

శర్వానంద్… తన నెక్స్ట్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. కోలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ గతంలో సూర్య అండ్ కార్తిలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ హిట్స్ ఇస్తుంది. ఇలాంటి సంస్థతో శర్వ తన 30వ సినిమా చేస్తున్నాడు. శ్రీ కార్తీక్ అనే డెబ్యు డైరెక్టర్ ఈ బైలింగ్వల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తన్న ఈ #Sharwa30 ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఒకే ఒక జీవితం అనే టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్, ఒక ఫీల్ గుడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. శర్వా గిటార్ తగిలించుకోని ఉన్న ఈ పోస్టర్ లో సిటీ అండ్ విలేజ్ లైఫ్ లో పోట్రే చేస్తూ డిజైన్ చేశారు. ఈ మ్యూజికల్ ఫిల్మ్ కి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇస్తుండగా, రైటర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నాడు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తో మంచి కంబాక్ ఇచ్చిన అక్కినేని అమలా మరోసారి ఈ ఒకే ఒక జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నారు.