Tollywood: హెబాప‌టేల్ న‌టించిన ” తెలిసినవాళ్ళు ” త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు!

Tollywood: సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ Tollywood చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంటే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ తన సినీ కెరీయర్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది.

ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. Tollywood తెలిసినవాళ్ళు నిర్మాత : సిరెంజ్ సినిమా, సమర్పణ : కేఎస్వీ ఫిలిమ్స్, కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం : విప్లవ్ కోనేటి, చాయాగ్రహణం : అజయ్ వి నాగ్, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సంగీతం : దీపక్ వేణుగోపాలన్, సాహిత్యం: డాక్టర్ జివాగో, కళ : ఉపేందర్ రెడ్డి, కోరియోగ్రఫీ : జావేద్ మాస్టర్ , శైలజ మాస్టర్, ఫైట్స్: సీ హెచ్ రామ కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ : డా. జెకె సిద్ధార్థ, కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్, పీఆర్వో : మధు వీ ఆర్, డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం , ధీరజ్.