Virat Kohli: మ‌హిళ‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కోహ్లి..

Virat Kohli: భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌హిళాల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతూ.. ఒక ఆస‌క్తిక‌ర‌మైన ఫోటోను పంచుకున్నాడు కోహ్లీ. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌ను చూస్తూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేది మ‌నిషి జీవితంలో అద్భుత‌మైన విష‌య‌మ‌ని అంద‌మైన అనుభ‌వ‌మ‌ని.. దేవుడు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప్రాణంపోసే శ‌క్తిని ఎందుకు ఇచ్చాడంటే.. వారు పురుషుల క‌న్నా బ‌ల‌వంతులు కాబ‌ట్టే అని పేర్కొన్నాడు కోహ్లీ. త‌న జీవితంలో ఉన్న మ‌హిళ‌ల‌తో పాటు అంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని ప్ర‌క‌టించాడుVirat Kohli:. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.