92 ఏళ్ల టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించిన హనుమాన్

92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్ ‘హను-మాన్ ’92 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి సినిమా అయిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది.

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది,  హిందీతో సహా అన్ని భాషలలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. హను-మాన్ నిజానికి నార్త్ రీజియన్‌లో స్ట్రెయిట్ హిందీ సినిమాలా అలరించింది. రిజనబుల్  టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.  

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హను-మాన్ మూడు వారాల రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటరైయింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మరికొన్ని వారాల పాటు హను-మాన్ అద్భుతమైన రన్ కొనసాగుతుంది.