‘హలగలి’ – షూటింగ్ దశలో అత్యంత భారీబడ్జెట్ పాన్ ఇండియ చిత్రం

దుహర మూవీస్ బ్యానర్ పై కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మాతగా, సుఖేష్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హలగలి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో లవ్ మాక్ టైల్ ఫెమ్ డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పిరియాడిక్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా చిత్రం కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

1857వ సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటనల స్పూర్తితో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పిరియాడిక్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సీన్స్ మైసూర్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాలో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. చిత్రీకరణ కొంతభాగం పూర్తి అయిన తర్వాత టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీడియాతో పంచుకుంటాము అని చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు: డార్లింగ్ క్రిష్ణ
రచన దర్శకత్వం: సుకేశ్ డికె
నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల
సహానిర్మాత: లక్ష్మీ శ్రీనివాస్ యార్లగడ్డ
బ్యానర్: దుహర మూవీస్ బ్యానర్