500 కుటుంబాల కోసం కోట్లు దానం చేసి ‘రికార్డు బ్రేక్’ చేసారు

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన సినిమా ‘రికార్డ్ బ్రేక్’. ఈ సినిమా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ప్రొడ్యూస్ చేశారు. 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. గ్లింప్స్ ‘మాతృదేవోభవ’ దర్శకులు అజయ్ కుమార్, టీజర్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ట్రైలర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ విడుదల చేశారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ … “ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు. ‘రికార్డ్ బ్రేక్’కి మెయిన్ హీరోలు కళా దర్శకుడు, ఫైట్ మాస్టర్, సంగీత దర్శకుడు. సాబూ వర్గీస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది” అన్నారు.
దివంగత నటుడు చలపతిరావు చివరిగా నటించిన సినిమా అంటూ చదలవాడ గారు చలపతి రావు గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు…. “చలపతి రావు గారు మొదటి రోజు నుంచి ఈ సినిమా కోసం నాతో పాటు నిలబడ్డారు. ఆయన చివరి రోజుల్లో డబ్బింగ్ చెప్పారు. అప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ నాతో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు. చదలవాడ గరుసినేమాకి పని చేసిన వారి గురించి మాట్లాతూ…. “తన అండగా నిలిచిన నా దర్శకుడు అజయ్‌, నా ప్రసన్న కుమార్ ఇప్పుడు ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం. నాకు ఐదేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీకి ఉపయోగపడే కథ కావాలనుకుని ఈ సినిమా మొదలుపెట్టా. కొంతమంది దర్శకులు సినిమా చూసి ‘రికార్డ్ బ్రేక్’ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. చివరి 45 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది” అని అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ ….. “సినిమా మీద వచ్చిన డబ్బులు చూసుకోకుండా… బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమాపై పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాస రావు గారు. చదలవాడ శ్రీనివాస రావు గతంలో ‘జీవిత ఖైదీ’ చేశారు. ‘మాతృదేవోభవ’ హిందీ రీమేక్ ‘తులసి’ని మనిషా కొయిరాలతో చేశారు. నారాయణ మూర్తి గారితో ‘ఏ ధర్తీ హమారీ’ హిందీ సినిమా చేశారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి ఆయన. ‘బిచ్చగాడు’ను తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడీ ‘రికార్డ్ బ్రేక్’తో ఎంతో మందిని చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ, ఒరియా… మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా ‘రికార్డ్ బ్రేక్’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త పాయింట్ టచ్ చేస్తూ చదలవాడ శ్రీనివాస రావు ఈ సినిమా చేశారని ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ అన్నారు.
నటి సత్య కృష్ణ మాట్లాడుతూ … ” రికార్డ్ బ్రేక్’ సినిమాలో మంచి రోల్ చేశా. నాకు ఈ అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాస రావు గారికి థాంక్స్. ఆయన సంస్థలో నాకు రెండో చిత్రమిది” అన్నారు.
ఇంకా తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నటీ నటులు : నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్

సాంకేతిక సిబ్బంది :
కథ: అంజిరెడ్డి శ్రీనివాస్
సంగీతం: సాబు వర్గీస్
కూర్పు: వెలగపూడి రామారావు
ఛాయాగ్రహణం: కంతేటి శంకర్
నిర్మాణం: చదలవాడ బ్రదర్స్
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథనం – దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు
పి.ఆర్.ఓ : మధు వి ఆర్