Gopichandh: సీటీమార్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్‌.. తాజాగా టీజ‌ర్ రిలీజ్‌!

Gopichandh: టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం సీటీమార్‌. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో Gopichandhగోపీచంద్ స‌ర‌స‌న మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటుంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. దీంట్లో Gopichandhగోపీచంద్ క‌బడ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట అంటూ డైలాగ్ చెప్పె ఎంతో అల‌రిస్తుంది. అలాగే క‌బ‌డ్డీ ఆడ‌వాళ్ల టీంతో గోపీచంద్ కోచ్‌గా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్రంలో దిగంగ‌న సూర్య‌వంశీ, భూమిక‌, రావు ర‌మేశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. హాట్ భామ అప్స‌ర‌రాణి ఈ చిత్రంలో ఐటెంసాంగ్‌లో క‌న‌బ‌డ‌నుంది. అలాగే ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా.. ఏప్రిల్ 2న Gopichandhఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.