Tollywood: మా ర‌క్తం, చెమ‌ట చిందించి క‌ష్ట‌ప‌డుతున్న చిత్రం సీటీమార్‌: డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది

Tollywood: ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజైన్ గోపిచంద్‌, త‌మ‌న్నా లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. Tollywoodఈ చిత్రం స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. గోపిచంద్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 22) ఉద‌యం 10:36 నిమిషాల‌కు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

యాక్ష‌న్ చెప్ప‌గానే క‌బ‌డ్డీ, క‌బ‌డ్డీ,క‌బ‌డ్డీ అంటూ మొద‌లైన ఒక నిమిషం12 సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేయ్ కార్తి‌..అంటూ రావు ర‌మేష్ పిల‌వ‌గానే న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే ఒక‌టి మా ఇంట్లో వాళ్లు పిల‌వాలి లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి.. ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్, అలాగే క‌బ‌డ్డీ మైదానంలో ఆడితే ఆట..బ‌య‌ట ఆడితే వేట అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉన్నTollywood ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. ఈ సంద‌ర్భంగా మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ..“”మా రక్తం, చెమట చిందించి ఎంతో కష్టపడి తెరకెక్కించిన సీటీమార్ టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ టీజర్ మీకు చూపించాలని ఎంతగానో ఎదురుచూశాం. మీకు తప్పకుండా నచ్చుతుందని, మీ ప్రేమ‌, ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను”అన్నారు. గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న Tollywoodఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.