సాహసం రిజల్ట్ రిపీట్ అవుతుందా?

యాక్షన్ హీరో గోపీచంద్ స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. చాణక్య సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తూనే, మరో మూవీని మొదలు పెట్టాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ గోపీచంద్ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభమైంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఇండియాతో పాటు నేపాల్‌, కాంబోడియా, థాయలాండ్‌ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు.

గతంలో బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్, గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన సాహసం సినిమా మంచి హిట్ అయ్యింది. అదే మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఈ మూవీ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. గోపీచంద్‌ను కొత్త యాంగిల్ లో చూపించబోతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని బిను సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫీల్ గుడ్ సినిమాలు చేస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ అయినా గోపీచంద్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.