అభిమానికి ఆటో కొనిచ్చిన టాలీవుడ్ హీరో

హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు బ్యానర్లు కట్టించి హంగామా చేయడం అభిమానులకు సరదా. ఇక తమ సినిమాలతో అభిమానులను అలరించడానికి హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. అభిమానులు ఇష్టపడే సినిమాలు తీయాలని అనుకుంటారు. అలాగే అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది హీరోలు ఆదుకుంటూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో గోపీచంద్ కూడా అదే పనిచేశాడు.

gopichand

తన అభిమానికి రూ.2 లక్షలు పెట్టి గోపీచంద్ ఆటో కొనిచ్చాడు. గోపీచింద్ కొనిచ్చిన ఆటో నడుపుకుని అభిమాని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరీంనగర్‌కు చెందిన ఒక యువకుడు గోపీచంద్‌కు వీరాభిమాని. ఇటీవల ఆ అభిమాని కరోనా బారిన పడటంతో వైద్యం కోసం భారీగా ఖర్చు చేసి అప్పుల పాలయ్యాడు. దీంతో కుటుంబాన్ని పోషించడానికి కూడా డబ్బులు లేని పరిస్ధితి ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్.. అభిమానికి రూ.2 లక్షల చెక్ పంపించాడు. ఈ డబ్బులతో అభిమాని ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ అభిమాని తన ఫ్రెండ్స్‌కు చెప్పడంతో ఇది బయటపడింది. కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకున్న గోపీచంద్ నిజంగా రియల్ హీరో అని సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు.