మెగా ఫ్యామిలీ నుంచి బాలయ్యకు ఆహ్వానం

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఈ నెల 9న రాజస్థాన్‌ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్‌ కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొనే అవకాశముంది. ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరయ్యే అవకాశముంది.

balayya

ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా నాగబాబు తన కూతురు పెళ్లికి ఆహ్వానిస్తున్నాడు. అందులో భాగంగా నందమూరి నటసింహం బాలకృష్ణకు నాగబాబు శుభలేఖ పంపినట్లు సమాచారం. అంతేకాకుడా బాలయ్యకు నేరుగా నాగబాబు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్, నాగార్జునకు స్వయంగా నాగబాబు ఫోన్ చేసినట్లు టాక్.

ఇక పలువురు హీరోయిన్లను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పూజాహెగ్డే, రష్మిక మందన్నాతో పాటు కొంతమంది హీరోయిన్లను కూడా పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డైరెక్టర్లు కొరటాల శివ, రాజమౌళి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అలాగే దిల్ రాజు, దానయ్య, సురేష్ బాబులను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్యను విమర్శిస్తూ నాగబాబు అనేక వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫంక్షన్ల విషయానికొస్తే.. అలాంటి వాటిని బాలయ్య పట్టించుకోడు. ఈ క్రమంలో నిహారిక పెళ్లికి బాలయ్య వెళతారా?.. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.