శీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని ‘హలో మిత్రమా……సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెయ్, యుద్ధం చెయ్, యుద్ధం చెయ్‌రా..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు విడుదల చేశారు. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ”మా ‘జైసేన’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవల మా అన్నయ్య నాగబాబుగారి చేతులమీదుగా రిలీజ్ చేశాం. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. నా సినిమా ఫస్ట్ సాంగ్ అన్నయ్య చేతుల మీదుగా రిలీజ్ చేయడం, అది చాలా పెద్ద హిట్ అయి మంచి ట్రెండింగ్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘జైసేన’ టైటిల్ సాంగ్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన శ్రోతలకు చాలా చాలా థాంక్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
కో-ప్రొడ్యూసర్ పి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ”ఈ పాట విడుదలైన క్షణం నుంచే మంచి వ్యూస్ వస్తున్నాయి. పాట చాలా బాగుందని, ఎంతో ఇన్స్పైరింగ్గా ఉందని అందరూ చెబుతున్నారు. ఈ పాటను హిట్ చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌గౌతమ్ పరిచయం అవుతున్నారు. అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్, పార్వతిచందు, పాటలు: అభినయ్ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్, డ్యాన్స్: అమ్మారాజశేఖర్, అజయ్, ఫైట్స్: కనల్ కన్నన్, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్, నిర్మాత: వి.సాయి అరుణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.