ధనుష్ కోసం హాలీవుడ్ నటుడు?

సూపర్ స్టార్ రజినీకాంత్ తో పేట సినిమా చేసి కోలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్, ఇప్పుడు రజినీ అల్లుడు ధనుష్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. #D40 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో యూకేలో షూటింగ్ మొదలు కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఒక హాలీవుడ్ నటుడు కనిపించబోతున్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ట్రాయ్, బ్రేవ్ హార్ట్ లాంటి ప్రాజెక్ట్స్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న జేమ్స్ కాస్మో మొదటిసారి ఇండియన్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కార్తీక్ సుబ్బరాజ, జేమ్స్ కాస్మోకీ వెల్కమ్ చెప్పాడు.

నిజానికి #D40 2016లోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా, కార్తీక్ సుబ్బరాజ్ పేట సినిమా కోసం ధనుష్ ప్రాజెక్ట్ ని వాయిదా వేశాడు. 2019లో పేట రిలీజ్ అయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది. మామ రజినీకాంత్ తో హిట్ కొట్టిన కార్తీక్ సుబ్బరాజ్, ధనుష్ తో కూడా సూపర్ హిట్ ఇస్తాడని అతని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వనుండడం విశేషం. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన #DnA, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా గత మూడు నాలుగేళ్లుగా కలిసి వర్క్ చేయలేదు. పేట సమయంలో ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ అయిపోవడంతో చాలా కాలం తర్వాత ధనుష్ అనిరుధ్ కలిసి అదిరిపోయే ఆల్బమ్ ఇవ్వాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.