వద్దన్న చోటే… వంద కోట్లు

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహూ. భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకి బాలీవుడ్ వర్గాల నుంచి, అక్కడి క్రిటిక్స్ నుంచి విపరీతమైన నెగటివ్ రివ్యూస్ ఎదురయ్యాయి. ప్రభాస్ ఇండియన్ స్టార్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు, భరించలేని సినిమా తీశాడు. అర్ధం లేని స్టంట్స్ చేశాడు అంటూ బి-టౌన్ క్రిటిక్స్ మన సినిమాపై దుమ్మెత్తి పోశారు. ఇక సాహూ సినిమాకి నార్త్ లో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశారు కానీ వారి అంచనాలని తలకిందులు చేస్తూ సాహూ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.

350 కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిన సాహూ సినిమా కేవలం హిందీ వెర్షన్ లోనే వంద కోట్ల నెట్ రాబట్టడం విశేషం. నాలుగు రోజుల్లోనే ఈ మార్క్ ని టచ్ చేసిన సాహూ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టిస్తోంది. నార్త్ లోని మాస్ సెంటర్స్ బాగా కనెక్ట్ అవడంతో రిపీటెడ్ ఆడియన్స్ రావడం మొదలు పెట్టారు, దీంతో సాహూ వసూళ్ల సునామి ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎక్కడ నెగటివ్ టాక్ వచ్చిందో అక్కడే సత్తా చాటుతున్న ప్రభాస్, ప్రేక్షకులకి నచ్చితే ఎవరు ఆపినా సినిమా ఆగదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం హిందీ సాహూకి ఉన్న ఊపు చూస్తుంటే మరో వారం పది రోజుల్లో 2019 టాప్ గ్రాసర్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.