తెలంగాణ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ గారు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కు సంబంధించి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున కుటుంబాన్ని కలిపి అలా వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని కుటుంబమే కాకుండా ఆ విషయంకు సంబంధించిన సమంత అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు స్పందించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్, నాని, విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, శ్రీ విష్ణు, మంచు లక్ష్మి, అల్లు అర్జున్, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విష్ణు, నిర్మాత స్వప్న దత్ చలసాని తదితరులు ఏకధాటిగా కొండా సురేఖ గారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్పందించడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలను ఇండస్ట్రీ అస్సలు సహించదు అంటూ ఎందరో ప్రముఖ నటులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వారు స్పందించడం జరిగింది.
Home సినిమా వార్తలు కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యల పై ఏకమవుతున్న సినీమా ఇండస్ట్రీ – #FilmIndustryWillNotTolerate