11 ఇయర్స్ ఆఫ్ వాంటెడ్… ఫ్యాన్స్ ఖుషి

మహేష్ బాబుని స్టార్ హీరోని చేసిన సినిమా పోకిరి. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ భారీ హిట్ మూవీ, అప్పటికి ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెరిపేసింది. అన్ని భాషల్లో రీమేక్ అయిన పోకిరి, అక్కడ కూడా హిట్ అయ్యి అదర్ ఇండస్ట్రీ మేకర్స్ మన సినిమాల వైపు తిరిగి చూసేలా చేసింది. బాలీవుడ్ ఇదే మూవీని సల్లూ భాయ్ వాంటెడ్ పేరుతో రీమేక్ చేశాడు. ప్రుభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్, వాంటెడ్ సినిమాలో “మైనే ఏక్ బార్ జో కమిట్మెంట్ కర్ ది తో, ఫిర్ మే అప్నే ఆప్ కి భి నహి సుంతా” అనే డైలాగ్ చెప్తుంటే థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేశారు. సరైన కథ పడితే సల్మాన్ సినిమా బాక్సాఫీస్ దెగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పిన ఈ వాంటెడ్ మూవీ నేటికి 11 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సల్మాన్ ఫ్యాన్స్ #11yearsofSplendidWanted అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.