నో బెయిల్… కస్టడీకి పరిమితం

డ్రగ్ స్కాండల్ లో ఇరుకున్న కన్నడ నటి సంజన ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉంది. బుధవారం సంజన బెయిల్ హియరింగ్ ఉన్నా కూడా కోర్ట్ దాన్ని రెండు రోజులు వెనక్కి నెట్టి శుక్రవారం హియరింగ్ పెట్టింది. ఈ సమయంలో సంజన బెయిల్ పిటీషన్ ని తిరస్కరించి, 12 రోజుల కస్టడీని పెంచింది. తాజా తీర్పుని అనుసరించిన సంజన సెప్టెంబర్ 30 వరకు పరప్పన అగ్రహార జైలులోనే ఉండనుంది.

సంజనతో పాటు జైలు పంచుకుంటున్న మరో బాలీవుడ్ అమ్మాయి రాగిణి ద్వివేదికి ఈరోజు బెయిలు హియరింగ్స్ ఉన్నాయి. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న రాగిణి, సెప్టెంబర్ 28 వరకూ అగ్రహార జైలులోనే ఉండాల్సి ఉంది. కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తే రాగిణి ఈరోజు బయటకి వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే బెయిలు మంజూరు చేయడం కష్టంగానే కనిపిస్తుంది. బాలీవుడ్ నైట్ లైఫ్ స్టార్స్ కి సంజన, రాగిణి పార్టీస్ ఇచ్చినట్లు అందులో డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం. ఈ డేటాని తీసుకోనే నార్కోటిక్స్ లిస్ట్ ప్రిపేర్ చేసిందని మీడియా కథనాలు చెప్తున్న విషయం.