పీపుల్స్ స్టార్ ఆర్.నారాయుణమూర్తికి ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డు

R Narayana Murthy

గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం, విక్రమ్ హాలులో బహూకరించనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు తెలిపారు. ఈ అవార్డులలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయుణమూర్తి, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్, ఈటీవీ, టి.వి.9లకు ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డులను అందిస్తున్నారు. అలాగే ఈ అవార్డులలో లయన్ ఎ.విజయ్‌ుకుమార్(సాంస్కృతిక), డా.పి.కవులాప్రసాదరావు(హస్తకళ), జిత్‌మోహన్ మిత్ర(సంగీతం, నటన), పి.యుగంధర్(కార్మిక సేవ)లకు ఆయా రంగాల్లో పురస్కార ప్రదానం జరుగుతుందని ధర్మారావు తెలిపారు. ఫాస్-దాసరి 2019 రంగస్థల, టి.వి., సినీ త్రిరంగ ప్రతిభా అవార్డులను అల్లరి సుభాషిణి, వి.హెచ్.ఇ.ఎల్.ప్రసాద్, వి.రావుకృష్ణలకు అందిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాసరి సినీ చిత్ర కార్యక్రమంలో చంద్రతేజ, లలితారావు పాల్గొంటారని, ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీధర స్వామీజీ ఆశీస్సులు అందచేస్తారని ధర్మారావు తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుదు దొండపాటి సత్యంబాబు ప్రధాన అతిథులుఆ పాల్గొంటారు.