పాటలు మినహా.. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘నటరత్నాలు’

ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నటరత్నాలు’. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ నటరత్నాలుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెండితెరకు పరిచయం చేసిన ఇనయా సుల్తాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందన్న దర్శకుడు అన్నారు.

మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కథాకథనం యూత్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని దర్శకుడు నర్రా శివనాగు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టాకీ పనులు పూర్తయ్యాయి. ఇక పాటలకు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలింది.

టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ అంతా కూడా పూర్తి చేసి అక్టోబర్‌ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యానారాయణ, సీరియర్ దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సిహెచ్ నాగమధు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. గాదె నాగ భూషణం, అందెల చిరంజీవి అసోసియేట్ డైరెక్టర్స్‌గా మహేంద్ర కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గిరి కుమార్ కెమెరామెన్‌గా, ఆవుల వెంకటేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

సాంకేతిక వర్గం
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : నర్రా శివనాగు
కో డైరెక్టర్ : మహేంద్ర
అసోసియేట్ డైరెక్టర్స్ : గాదె నాగభూషణం, అందెల చిరంజీవి
బ్యానర్: ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: డా. దివ్య
సహ నిర్మాత: ఆనందాసు శ్రీ మణికంఠ
ఎడిటర్: ఆవుల వెంకటేష్
కెమెరా: గిరి కుమార్
లైన్ ప్రొడ్యూసర్: సిహెచ్. నాగ మధు
పిఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు