నాగార్జున కోసం హాట్ బ్యూటీని సెలెక్ట్ చేసిన గరుడవేగ దర్శకుడు

ileana nagarjuna

కొన్ని రోజుల క్రితం PSV గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో నాగార్జున కొత్త చిత్రం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు నారాయణ్ దాస్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, మరియు శరత్ మరార్ ఆ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం నటీనటుల కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రవీణ్ గ్లామరస్ బ్యూటీ ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకమైనదని తెలుస్తోంది. అందుకే సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని దర్శకుడు ఎక్కువగా ఇలియానాపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమా టైటిల్ పై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి మరో స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.