తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్సిటల్లో చేరిన విషయం తెలిసిందే. హఠాత్తుగా కేసీఆర్ అస్వస్థతతో హాస్పిటల్లో చేరడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో నిన్న వ్యక్తిగత డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇవాళ మధ్యాహ్నం కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, సంతోష్‌తో కలిసి యశోద హాస్పిటల్‌కి కేసీఆర్ వచ్చారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, ఈసీజీ, టుడీ ఎకో, లివర్ పరీక్షలు డాక్టర్లు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన జారీ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సమస్యలు లేవని, ప్రతి ఏడాది మాదిరిగానే రొటీన్ టెస్టులు చేశామన్నారు.
శ్వాస నాళాల్లో సమస్య ఉందని, సీఎం కేసీఆర్‌కు కరోనా లేదని చెప్పారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు రేపు వస్తాయన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ తిరిగి ప్రగతిభవన్‌కి చేరుకున్నారు.