తేజ సినిమా నుంచి త‌ప్పుకున్న కాజ‌ల్‌.. ఓకే చేసిన తాప్సి!

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన విష‌యం తెలిసిందే. తన భర్తతో కలిసి కుషన్ బిజినెస్‌ను కూడా మొదలుపెట్టారు. గ‌త 13 ఏళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ.. త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్న న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ తాజాగా ఒక సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.

kajol left teja movie

తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించడానికి కాజల్ అంగీకరించిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకున్నారట. ఇక ఇప్పుడు ఆమె స్థానంలో తాప్సీను ద‌ర్శ‌కుడు తేజ తీసుకున్నారని అంటున్నారు. కారణాలు ఏంటో తెలియవు కానీ కాజల్-తేజ కాంబోలో తెర‌కెక్కునున్న‌ నాలుగో సినిమా బ్రేక్ అయ్యిందని టాక్. కాజ‌ల్ ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతోనే తేజ ఆమెను ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి, సీత సినిమాల్లో తేజ‌తో ప‌నిచేశారు కాజ‌ల్‌. మొత్తానికి తాప్సి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారన్న మాట.