ఇండియన్ పనోరమా అవార్డుల గురించి మీకు తెలుసా?

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో ఇండియన్ పనోరమా అనేది ఒక భాగం. IFFIలో 1978లో దీనిని ప్రవేశపెట్టారు. భారతీయ సినిమాలను ప్రోత్సహించడంతో పాటు భారతదేశం యెక్క సంస్కృతి, సాంప్రదాయాలను సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేయడమే దీని ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఇండియాలోని అన్ని భాషల్లో విడుదలైన సినిమాల్లో నుంచి బెస్ట్ వాటిని ఎంపిక చేసి ఇండియన్ పనోరమాకు ఎంపిక చేస్తారు. వీటికి మాత్రమే IFFIలో ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్టరీ ఆఫ్ ఇన్పర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఈ సినిమాలను ఎంపిక చేస్తాయి.

indian panorama

ఫీచర్ ఫిలిమ్స్‌తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్‌ను కూడా ఎంపిక చేస్తారు. ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీ కింద గరిష్టంగా 26 సినిమాలను ప్రతి సంవత్సరం ఎంపిక చేయవచ్చు. ఇండియన్ పనోరమా నిబంధనల ప్రకారం బెస్ట్ సినిమాలను వీటికి ఎంపిక చేస్తారు. ఈ బెస్ట్ సినిమాలను ఎంపిక చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యులను ఎంపిక చేస్తోంది. ఆ జ్యూరీ సభ్యులు కొన్ని సినిమాలను ఎంపిక చేస్తారు. ఈ జ్యూరీలో డైరెక్టర్లు, నిర్మాతలు, జర్నలిస్టులు, ఫైట్ మాస్టర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన వారు ఉంటారు.

ఇక IFFIలోని సభ్యులు కొన్ని సినిమాలను మాత్రమే నామినేట్ చేస్తారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI), ప్రొడ్యూసర్స్ గిల్డ్ పంపించిన సిఫార్సుల ప్రకారం ఇంటర్నల్ కమిటీ ఆఫ్ డీఎఎఫ్ ఇండియన్ పనోరమాకు మరికొన్ని సినిమాలను నామినేట్ చేస్తుంది. IFFI ఫెస్టివల్ ప్రతి ఏడాది జనవరిలో గోవాలో జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కు దేశ, విదేశాల నుంచి వేలామంది ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్లు హాజరువుతూ ఉంటారు. వీళ్ల సమక్షంలో అంతర్జాతీయ వేదిక మీద ఈ సినిమాను ప్రదర్శిస్తారు. సినిమాలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బెస్ట్ సినిమాలను మాత్రమే ఇండియన్ పనోరమాకు ఎంపిక చేస్తారు.