మొత్తనికి బిగ్ బాస్ నాలుగవ సీజన్ ని ధైర్యంగా మొదలు పెట్టబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా మునుపెన్నడు లేనంతగా జాగ్రత్తలు తీసుకుంటూ షోని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక నాగార్జున హోస్ట్ గా మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకోబోతున్నాడు. 60ఏళ్ల వయసుతో నాగార్జున కోవిడ్ భారిన పడకుండా చాలా జాగ్రత్తగా వర్క్ చేయడానికి రెడీ అయ్యారు.
ఇక ఇప్పటికే బిగ్ బాస్ సెట్ ని సిద్ధం చేసిన నిర్వాహకులు దాదాపు ఆ సెట్ కోసం 4కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ప్రోమో షూట్ కి 40మంది వర్కర్స్ ఉండాల్సింది. కానీ 20 మంది లోపే పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్ లిస్ట్ పై ఇప్పటికే పలు రకాల రూమర్స్ వస్తున్నాయి. కేవలం 15మంది లోపే హౌజ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎపిసోడ్స్ 70రోజులే ఉంటుందని కూడా టాక్ వస్తోంది. ఈ సారి సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ ఏ మాత్రం ఉండవట. చివరగా ఫైనల్ విజేతను ప్రకటించడానికి మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం.