దేవుడా.. నిహారిక పెళ్లి చీర ఖరీదెంతో తెలుసా?

నిహారిక, చైతన్యల పెళ్లి ఘనంగా జరగ్గా.. ఈ పెళ్లి గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. నిహారిక పెళ్లి అత్యంత కాస్ట్‌ లీగా జరిగింది. ప్రత్యేక విమానాల్లో మెగా ఫ్యామిలీ ఉదయ్ పూర్ చేరుకోవడం, ఖరీదైన బట్టలు ధరించడం, ప్రతి ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీ అంతా డిఫరెంట్ దుస్తుల్లో కనిపించడం లాంటివి చూస్తే.. వీటికి చాలా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సంగీత్, మెహెంది, పెళ్లి ఫంక్షన్లలో డిఫరెంట్ దుస్తులలో మెగా ఫ్యామిలీ కనువిందు చేసింది. స్పెషల్ డిజైనర్‌తో ఈ డ్రెస్‌లను డిజైన్ చేయించారట. ఈ డ్రెస్‌ల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఈ ఫంక్షన్లలో నిహారిక ధరించిన చీరల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిశ్చితార్థం రోజు తన తల్లి ధరించిన 32 ఏళ్ల నాటి చీరను ఇప్పుడు నిహారిక కట్టకుంది. ఇక మంగళ స్నానానికి ఆకుపచ్చ చీరను, హల్దీలో బంగారు వర్ణం చీరను, పెళ్లి కూతురు వేడుకలో నీలం బంగారు రంగు చీరలో నిహారిక కనిపించింది.

ఇక పెళ్లిలో నిహారిక కట్టుకున్న బంగారు వర్ణం డిజైనర్ శారీ చాలా కాస్ట్‌ లీ. ఈ చీర ధర రూ.20 లక్షలు అని తెలుస్తోంది. గుజరాత్‌లో ఈ చీరను డిజైన్ చేయించినట్లు సమాచారం. పెళ్లికి రెండు నెలల ముందే ప్రత్యేక డిజైనర్‌తో ఈ చీరను తయారు చేయించారట. ఇక నిహారిక ధరించిన బంగారు నగలకు చాలా ఖర్చు అయిందట. అలాగే వరుడు చైతన్య ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలకు చాలా ఖర్చు అయిందని తెలుస్తోంది.