ప్రముఖ డైరెక్టర్‌కు గుండెపోటు.. షాక్‌లో సినీ పరిశ్రమ

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫ్రాన్సిన్ రెమో డిసౌజా గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు ఆయన చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

REMO RAJA

ఆస్పత్రిలో డిసౌజాతో పాటు అతడి భార్య ఉంది. ఆమెకు వైద్యులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. రెమో డిసౌజా వయస్సు 46 సంవత్సరాలు. కిక్, జీరో, బాజీరావ్ మస్తానీ, భజరంగీ భాయీజాన్, యే జవాని హై వంటి సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.

ఇక టీవీలలో పలు డ్యాన్స్ షోలకు ఆయన జడ్జిగా వర్క్ చేశారు. ఇక ఆయన డైరెక్టర్‌గా కూడా మారి ఫాల్తూ, రేస్-3, ఏబీసీడీ సినిమాలను తెరకెక్కించారు. రెమో గుండెపోటుకు గురయ్యారనే వార్త బాలీవుడ్‌ను షాక్‌కి గురి చేసింది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.