హీరో విజయ్ కుటుంబంలో చిచ్చు

తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. తన తండ్రి రాజకీయ పార్టీకి ఎవరూ సహకరించవద్దని విజయ్ కోరగా.. తాజాగా ఆ పార్టీపై చంద్రశేఖర్ తల్లి శోభా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమారుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడని తనకు తెలియదంది.

vijay

విజయ్ పేరిట ఒక సంస్థ నెలకొల్పనున్నట్లు కొన్ని పత్రాలపై చంద్రశేఖర్ సంతకం చేశాడని, అది రాజకీయ పార్టీ అని వారం క్రితం తనకు తెలిసిందని తాజాగా శోభా చెప్పారు. చంద్రశేఖర్ శోభను పార్టీ కోశాధికారిగా నియమించగా.. ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఇటీవల తన కుమారుడు కోరాడని శోభ చెప్పారు. విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడా? లేదా? అనేది విజయ్ మాత్రమే చెప్పగలగడని శోభ చెప్పారు.

అటు తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడవద్దని విజయ్ తన తండ్రిని కోరాడు. అయితే చంద్రశేఖర్ పార్టీని పెట్టడంతో గత కొంతకాలంగా తన తండ్రితో విజయ్ మాట్లాడటం లేదని తెలుస్తోంది. చంద్రశేఖర్ మాత్రం తన రాజకీయ పార్టీలో విజయ్‌కు ఎలాంటి పదవి లేదని చెబుతున్నారు. చూడాలి ఈ కుటుంబ వివాదం ఎటువైపు దారితీస్తుందో..