వినాయక్ హీరో అయ్యాడు… సీనయ్యగా మారాడు…

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి.వి వినాయక్, హీరోగా మారి చేస్తున్న సినిమా సీనయ్య. వినాయక్ హీరో ఏంటి అనే అనుమానాలు అందరికీ కలిగింది కానీ ఆ సినిమాకి దిల్ రాజు నిర్మాత అనగానే అనుమానం కాస్త ఆశ్చర్యంగా మారింది. ఇప్పటి వరకూ చిన్న చిన్న క్యామియా రోల్స్ మాత్రమే కనిపించిన వినాయక్, ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తున్న సీనయ్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని దసరా పండుగ కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో స్పానర్ పట్టుకోని, మాస్ లుక్ లో వినాయక్ కనిపించాడు. దర్శక దిగ్గజం, సౌత్ సెన్సేషన్ శంకర్‌ దగ్గర శిష్యరికం చేసిన ఎన్‌. నరసింహారావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

గతంలో శరభ సినిమా చేసిన నరసింహారావు, వినాయక్ ని దృష్టిలో పెట్టుకొనే కథ రాశాడు. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. నేడు వివివినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవి షూటింగ్ కి ముహుర్తం ఫిక్స్ చేశారు. రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టాడు. హీరోగా కనిపించడానికి వినాయక్ చాలా కష్టాలే పడ్డాడు, జిమ్ లో ఎంతో కష్టపడిన తర్వాత లుక్ మార్చిన వినాయక్ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. అవి చూసిన సినీ అభిమానులు మన వినాయక్ నిజంగానే హీరోలా ఉన్నాడే అనే నమ్మకం కలిగించాడు.