వరుణ్ తేజ్ రింగ్ లో దిగి కుమ్మడానికి రెడీ అయ్యాడు

మెగా హీరోలందరూ ఒకవైపు నడుస్తుంటే ఇంకో వైపు నడుస్తున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు చేసిన వరుణ్, ఎఫ్ 2 కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. తనలోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులకి పరిచయం చేసిన మెగా హీరో, రీసెంట్ గా వాల్మీకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. గద్దలకొండ గణేష్ గా నెగటివ్ టచ్ ఉన్న రోల్ ని పాత్రలో వరుణ్ తేజ్ ముందెన్నడూ చూడని హీరోని చూపించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా టెర్రిఫిక్ గా ఉంది. ఇలా రెండు సినిమాల్లో రెండు వేరియేషన్స్ చూపించిన వరుణ్ తేజ్, ఇప్పుడు మూడో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

Varun Tej New Movie Launch

తన నెక్స్ట్ సినిమా కోసం చాలా రోజులుగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వరుణ్ తేజ్, ఫారిన్ లో ట్రైన్ అయ్యి వచ్చాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 10న ప్రారంభం కాబోతోందని సమాచారం. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించ‌నున్న ఈ సినిమాని కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ట్ చేస్తున్నాడు. తొలిప్రేమలో లవర్ బాయ్ గా, అంతరిక్షంలో సైంటిస్ట్ గా, ఎఫ్ 2లో భార్య బాధితుడుగా, వాల్మీకీలో రూత్ లెస్ రౌడీ గద్దలకొండ గణేష్ గా ఇలా సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, తన నెక్స్ట్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి.