స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం… ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ ఎవర్ గ్రీన్ సాంగ్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మందికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అవసరాల కోసం, అవకాశాల కోసం ఏర్పడ్డ స్నేహం గురించి కాకుండా సినిమాలకి అతీతంగా సాగుతున్న స్నేహం గురించి మేము చెప్తున్నాం. ఈ ఇండస్ట్రీలో ట్రూ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే చాలా చిన్న లిస్ట్ వస్తుంది, అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-సునీల్ కూడా ఉంటారు.
త్రివిక్రమ్ రైటర్ కాకముందు, సునీల్ కమెడియన్ కాకముందు నుంచి ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకే రూములో ఉండి ఆలోచనలని పంచుకునే వాళ్లు. కాలం కలిసొచ్చింది, టాలెంట్ కి టైం కూడా కలిసి రావడంతో సునీల్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. త్రివిక్రమ్ మాటలకి సునీల్ డిక్షన్ కూడా కలవడంతో ఫన్ జనరేట్ అయ్యింది. ఈ కాంబోలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చాయి. నెమ్మదిగా త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాడు, సునీల్ హీరో అయ్యాడు. త్రివిక్రమ్ స్టార్స్ హీరోస్ తో సినిమాలు చేస్తుంటే, సునీల్ రాజమౌళి వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలో హీరోగా నటించాడు. అంతా బాగుంది అనుకునే టైంకి సునీల్ కెరీర్ అడ్డం తిరిగింది, వరస ఫ్లాప్స్ ఫేస్ చేశాడు, హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సునీల్ మళ్లీ కమెడియన్ అవతారం ఎత్తడానికి రెడీ అయ్యాడు. ఎవరో అయితే తన రీఎంట్రీ సెట్ అవుతుందో లేదో అని సునీల్ అనుకున్నాడో లేక సునీల్ మళ్లీ కమెడియన్ గా వస్తే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకున్నాడో కానీ అరవింద సమేత సినిమాలో సునీల్ కనిపించాడు.
ఎన్టీఆర్ పక్కన సునీల్ నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కమెడియన్ కన్నా సునీల్, అరవింద సమేత కథని ముందుకి తీసుకెళ్లే పాత్రగానే కనిపించాడు. సీరియస్ సినిమా కాబట్టి సునీల్ కామెడీ చేయడానికి స్కోప్ లేదు, ఈ లోటు త్రివిక్రమ్ కూడా ఫీల్ అయినట్లున్నాడు సునీల్ ని తన నెక్స్ట్ సినిమాలో సునీల్ ని కంప్లీట్ ఫన్ రోల్ లో చూపించబోతున్నాడు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో సినిమా రాబోతోంది. ఇప్పటికే సాంగ్స్ తో హల్చల్ చేస్తున్న ఈ మూవీలో సునీల్ నటిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమాకి సునీల్ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ బాగా నవ్విస్తాయట. మరి ఆ నవ్వులు ఏ రేంజులో ఉంటాయో తెలియాలి అంటే జనవరి 12 వరకూ ఆగాలి.