ఒక్క టీజర్ తో 175 కోట్లు… ఇది ప్యూర్ మహేశ్ స్టామినా

ఒక్క టీజర్ తో సోషల్ మీడియాని షేక్ చేసి నాలుగో రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉంచిన సూపర్ స్టార్ మహేశ్, ప్రొమోషన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇచ్చేశాడు. సూపర్ స్టార్ సరైన మాస్ సినిమా చేస్తే ఇలా ఉంటుంది అనిపించే రేంజులో సరిలేరు నీకెవ్వరూ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ రిలీజ్ చేసే ముందే, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ టీజర్ చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి… సినిమా రేట్ ఏంటో చెప్పండి అనే రేంజులో అనీల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా మెసేజ్ రిలీజ్ చేశాడు. టీజర్ బయటకి వచ్చాక అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాడంతో బయ్యర్లు కూడా ఫుల్ జోష్ లోకి వచ్చారు.

అనిల్ రావిపూడి ప్లాన్ వర్కౌట్ అయ్యి, సరిలేరు నీకెవ్వరూ సినిమా దాదాపు 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్ చెప్తోంది. ఇది మాత్రమే కాకుండా ఓవర్సీస్, డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ హక్కులన్నీ కలిపితే సరిలేరు నీకెవ్వరూ సినిమా 175 కోట్ల వరకూ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. మహేశ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ అయ్యి ఉండొచ్చు. సంక్రాంతి సీజన్ కావడం, సినిమాపై పాజిటివ్ బజ్ ఉండడంతో 100 కోట్ల థియేట్రికల్ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.