ఆర్టికల్ 370 కోసం ఆర్జీవీని రంగంలోకి దించుతున్న తేజ…

ప్రేమ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా ఒక‌ప్పుడు పేరున్న డైరెక్ట‌ర్ తేజ, నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రానాని మాత్రమే కాదు తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకున్న తేజ్, కమర్షియల్ సక్సస్ అందుకున్నాడు. ఇదే జోష్ లో సీత సినిమా చేసిన తేజ, సాయి శ్రీనివాస్ ని ముందెన్నడూ చూడనంత కొత్తగా చూపించాడు. సీత రిలీజ్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న తేజ్, ఇప్పుడు బాలీవుడ్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఆర్టిక‌ల్ 370 చుట్టూ తేజ కథ అల్లినట్లు సమాచారం. హిందీలో ఈ ఆర్టికల్స్ పై సినిమాల ట్రెండ్ నడుస్తుండడంతో తేజ కూడా ఇదే జానర్ లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఆర్టికల్ 370లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ మెయిన్ లీడ్ ప్లే చేయబోతున్నాడట. వర్మకి అమితాబ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఈ కారణంగానే ఆర్టికల్ 370లో అమితాబ్ ని ఒప్పించడానికి ఆర్జీవీ లైన్ లో పెట్టె ప్లాన్ తేజ చేస్తున్నాడు. ఆర్జీవీ అడిగితే అమితాబ్ కాదు అనడం జరగదు కాబట్టి తేజ దర్శకత్వంలో అమితాబ్ నటించడం దాదాపు కన్ఫామ్ అయినట్లే.