పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేసిన ‘కలియుగ’ సాంగ్స్

జనసేనాని పవన్ కళ్యాణ్, తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో బాగా స్పెర్డ్ అయ్యింది. ఒక పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాల్లో రీఎంట్రీ విషయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్… వీలు చిక్కినప్పుడల్లా చిన్న సినిమాలని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలా పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసిన తాజా సినిమా కలియుగ. రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కలియుగ.

బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై, నటుడు సై సూర్య నిర్మించిన సినిమా ‘కలియుగ’.. ఈ సినిమా ఆడియో పాటలను శుక్రవారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. మంచి సందేశంతో తీసిన ‘కలియుగ’ నిర్మాతగా సూర్యకు మంచి పేరు తెచ్చిపెట్టాలని, చిత్రాబృందానికి శుభాకాంక్షలు తెలిపారు వపన్. కమల్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘కలియుగ’ సినిమా విడుదల కానుంది.