బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రాండ్ గా మొదలుపెట్టాడు…

రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదే సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. దిల్‌ రాజ్‌, వి.వి.వినాయక్‌ ముఖ్య అతిథులుగా వచ్చిన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

bellamkonda sai srinivas

ముహుర్తపు షాట్‌కు వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ‘రభస’, ‘హైపర్‌’ చిత్రాలతో మిశ్రమ ఫలితాలను అందుకున్నారు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎయిట్ ప్యాక్ చేయడం విశేషం.