సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నాని హీరోగా, మళ్లీ రావా ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్నెనూరి రూపొందించిన చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలై మంచి విజయాన్ని సాధించి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రీమేక్ షాహిద్ కపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్సన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ హిందీ రీమేక్ ను డైరక్ట్ చేయడం విశేషం.
ఈ సినిమా రీమేక్ కోసం షాహిద్ భారీ రెమ్యూనిరేషన్ అడిగినా నిర్మాతలు అందుకు నో చెప్పకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ వర్గాలలో ఒరిజినల్ వెర్షన్ లో కొన్ని మార్పులు చేశారనే వార్తలు వినబడుతున్నాయి. ‘ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎంపిక అయిన అర్జున్ అనే తెలుగు యువకుడి నవల మార్కెట్ లోకి రావడం ద్వారా సినిమా మొదలవుతుంది. ఆ జెర్సీ పుస్తకం తెరవడంతోనే అర్జున్ అనే ఓ యువకుడి జీవితం మనకి పరిచయం అవుతుంది’. ఈ సన్నివేశాలను హిందీలో కూడా తీస్తున్న గౌతమ్ క్లైమాక్స్ కి చేంజెస్ చేస్తూ.. అర్జున్ కొడుకు కూడా తండ్రి స్ఫూర్తితో క్రికెట్ ఆడేలా మారుస్తున్నాడట. శ్రద్ధ శ్రీనాథ్ అద్భుతంగా నటించిన పాత్రని హిందీలో మృణాల్ ఠాకూర్ ప్లే చేస్తోంది. సూపర్ 30, బాట్ల హౌజ్ లో నటించిన మృణాల్ కి ఇది కెరీర్ టర్నింగ్ సినిమా అవనుంది. కరణ్ జోహార్, అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని షూటింగ్ త్వరగా పూర్తి చేసి 28 ఆగష్టు 2020న విడుదల చేస్తున్నారు.