హీరోని ఎలివేట్ చేసే రేంజులో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్

నమ్మ వేటు పుల్లై సినిమాతో హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ హీరో. అభిమన్యుడు ఫేమ్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్, ఆల్బమ్ కే హైలైట్ అయ్యేలా ఉంది. ఒక కామన్ మాన్ సూపర్ హీరో ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే విషయం చూపిస్తూనే… హీరోని ఎలివేట్ చేసే రేంజులో కంపోజ్ చేసిన ఈ సాంగ్ హీరో సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. లిరికల్ సాంగ్ లో శివ కార్తికేయన్ చుట్టూ డిజైన్ చేసిన విజువల్స్ బాగున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కూడా బయటకి వచ్చింది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో జరిగే తప్పులపై ఫైట్ చేసే కథతో ఈ సినిమా రానుందని అర్ధమవుతోంది. ఇప్పటివరకూ లవర్ బాయ్ ఇమేజ్ లో కనిపించిన శివ కార్తికేయన్ ఈ సినిమాతో సూపర్ హీరో అవతారం ఎత్తి కమర్షియల్ హీరోగా మారాడు. శివకార్తికేయన్ సినిమాల్లోనే ఇది బెస్ట్ లుక్ గా నిలిచే అవకాశం ఉంది.

టీజర్ లో వచ్చిన సీన్ హీరోయిక్ గా ఉంటూనే, హార్ట్ టచింగ్ గా కూడా ఉన్నాయి. హీరో టీజర్ చూస్తే అర్జున్ నటించిన జెంటిల్ మ్యాన్ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. అర్జున్ కూడా ఉన్నాడు కాబట్టి హీరో సినిమా జెంటిల్ మ్యాన్ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ లా అనిపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాలో కళ్యాణ్ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది.