సోగ్గాడి నెక్స్ట్ సినిమాలో యువరాణి మిత్రవింద…

బిగ్ బాస్ 3 షో కంప్లీట్ అవడంతో కింగ్ నాగ్, మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకు రచయితగా పనిచేసిన సోలొమన్ చెప్పిన లైన్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకోనున్నారట. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్న కాజల్, టాప్ స్టార్స్ అందరి పక్కన నటించింది కానీ నాగార్జునతో మాత్రం నటించలేదు. అక్కినేని నాగ చైతన్యతో దడ సినిమా చేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు నాగార్జునతో నటిస్తోంది. యంగ్ హీరోస్ అందరితో నటించిన కాజల్, మెగాస్టార్ తర్వాత మరో సీనియర్ హీరోతో నటించడం ఇదే మొదటిసారి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నాడు.