సినిమాల్లోకి దిల్ రాజు భార్య?

దిల్ రాజు.. తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిన పేరు. టాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయిన ప్రొడ్యూసర్. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన పేరు అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారి టాలీవుడ్‌లో బడా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దిల్ సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

DILRAJU

అయితే దిల్ రాజ్ మొదటి భార్య గుండెపోటుతో మరణించగా.. కొద్దిరోజుల పాటు దిల్ రాజు ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత ఇటీవల లాక్‌డౌన్‌లో దిల్ రాజు హైదరాబాద్‌కి చెందిన తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య గురించి ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన భార్యను టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దిల్ రాజు తీసుకురానున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒక ఓటీటీ యాప్ కోసం తేజస్విని రచయితగా మారనుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒక కథను కూడా ఆమె సిద్ధం చేసిందట.

ప్రస్తుతం కథను ఆమె మెరుగుతు దిద్దుతుందని, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వకీల్ సాబ్ సినిమా పూర్తైన తర్వాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆయన సోదరులు నిర్మాతలుగా మారారు. అలాగే దిల్ రాజు కుమార్తె ఆహా యాప్ కసం పనిచస్తుంది.