రష్మిక సెక్సీ వర్కౌట్ చూడండి

తెలుగుతో పాటు తమిళంలో వరుస పెట్టిన సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే తమిళంలో రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సెక్సీ వర్కౌట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RASHMIKA

మొదటగా బీచ్‌లో వర్కౌట్లు చేస్తూ వీడియోలను షేర్ చేసిన ఈ భామ.. ఎక్కడ వర్కౌట్లు చేసినా వాటిని వీడియోలు తీసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రష్మిక.. వర్కౌట్లు చేయడానికి అందరికీ మోటివేషన్ కావాలని అంటుంటారని, కానీ అవన్నీ ఏందుకు అని ప్రశ్నించింది. అవి లేకపోయినా కూడా చేయవచ్చని, కావాలంటే తన దగ్గర నుంచి నేర్చుకోండి అని సూచించింది.

ఈ వీడియోలో జంపింగ్‌లు చేస్తూ రష్మిక కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న రష్మిక.. ఇటీవల రాంచరణ్ భార్య ఉపాసనతో కలిసి చికెన్ తయారుచేసింది. ఈ సందర్భంగా తాము రాత్రి పడుకునే ముందు రెండు పెగ్గుల వైన్ తాగి పంది మాంసం తింటామని ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.