బాలీవుడ్ అగ్రనటుల ఇళ్లు కొన్న పాక్

బాలీవుడ్‌లో దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్ అగ్రనటులుగా వెలుగొందారు. బాలీవుడ్‌లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న వీరిద్దరు.. ఎంతోమంది అభిమానులు కూడా సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి దిగ్గజ నటులుగా ఎదిగారు. తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వార్తల్లొకెక్కాయి. దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్ పూర్వీకుల ఇళ్లను తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీరి పూర్వీకుల గృహాలు పెషావర్లో ఉండగా.. 1930లో రాజ్‌కపూర్ తాత ఒక హవేలిని పెషావర్లో కట్టించాడు.

dilipkumar

అయితే దేశ విభజన తర్వాత రాజ్‌కపూర్ ఫ్యామిలీ ఇండియాకి రాగా.. వీరి ఇళ్లు అప్పటినుంచి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నాయి. వీటిని అతడి నుంచి రూ.కోటిన్నరకు పాకిస్తాన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతేకాదు వీటిని వారసత్వం సంపదగా పాక్ ప్రభుత్వం గుర్తించింది.అలాగే దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇంటిని రూ.80 లక్షలు పెట్టి ఒక వ్యక్తి నుంచి పాక్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఈ గృహాలు శిధిలావస్థలో ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని పాక్ ప్రభుత్వం కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పాక్ ప్రభుత్వం వీటిని ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఏమైనా మార్చుతుందా.. లేదా.. ఇంకేమైనా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.