ధనుష్ నటించిన సినిమాకు అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోని ఇండియన్ పనోరమాలో ప్రదర్శితమయ్యే సినిమాలలో చోటు దక్కించుకుంది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇండియన్ పనోరమాలో ప్రదర్శితమయ్యే సినిమాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నవంబర్ 16 నుండి 24 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతుందని ఈ సందర్భంగా ప్రకటించారు.
తమిళం నుంచి ధనుష్ నటించిన ‘అసురన్’ సహా రెండు సినిమాలు ఎంపికయ్యాయి. ధనుష్ హీరోగా వెత్రి మారన్ దర్శకత్వం వహించిన ‘అసురాన్’ మాస్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాలో మంజు వారియర్, పశుపతి, డిజె అరుణాచలం, కెన్ కరుణస్ నటించగా.. జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
ఇక తమిళం నుంచి గణేష్ వినాయక్ దర్శకత్వం వహించిన ‘హనీ’ సినిమా కూడా ఇండియన్ పనోరమాలో ప్రదర్శితం కానుంది. ఈ ఘనత దక్కించుకున్నందుకు ఈ రెండు సినిమాల దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ గోవాలో జరుగుతుంది. వివిధ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న బెస్ట్ సినిమాలను ఇక్కడ ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. ఇక తెలుగు నుంచి “గతం” సినిమా దీనికి ఎంపికైంది.