‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అభిమానులకు ఇది శుభవార్తే. ‘మాస్టర్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో #MasterPongal అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

MASTER

ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కానుండటంతో అభిమానులు ఆనందంలో ముగినితేలుతున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. తొలుత ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

ఇప్పటికే విడుదలైన “మాస్టర్’ సినిమాకు సంబంధించి టీజర్లు యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి. తమిళంతో పాటు తెలుగు టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. విజయ్‌కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దీంతో తెలుగులోనూ ఈ సినిమా సత్తా చాటడం ఖాయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.