ఆహా ద్వారా మన ముందుకు రాబోతున్న ‘డియర్ నాన్న’

’21 వెడ్స్ 30′ వెబ్ సిరీస్ ద్వారా అందరికి పరిచయం అయిన చైతన్య రావు ఆ తరువాత కీడా కోలా, పారిజాత పర్వం వంటి మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా ‘డియర్ నాన్న’ అనే మరో సినితో ఆహా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఈ నెల 14 నుండి ఆహా లో ‘డియర్ నాన్న’ స్ట్రీమ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబేలో అందుబాటులో ఉంది. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మహీధర్ రెడ్డి & దేవేష్ కలిసి నిర్మించారు. యెష్ణ చౌదరి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంకు రీ సంగీతాన్ని అందిస్తున్నారు.